తల్లికి వందనం నిధులు జమ పై ఏపీ సర్కార్ కీలక అప్డేట్ »

AP Talliki Vandanam : తల్లికి వందనం నిధులు జమ పై ఏపీ సర్కార్ కీలక అప్డేట్

AP Talliki Vandanam Funds Release July Update : ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం నిధులు విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ సంవత్సరం ఈ నెల 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం కొన్ని సాంకేతిక లోపాల వలన జూలై 10 తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి కావలసిన నిధులు కేటాయించి ఆమోదం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం రిలీజ్ చేయాలని ఆమోదముద్ర వేశారు. దీంతో జూలై 10న తల్లికి వందనం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.

గత సంవత్సరం స్కూల్ ప్రారంభమైన తరువాత జూన్ లోనే తల్లికి వందనం నిధులు విడుదల చేశారు. అయితే ఈ సంవత్సరం సాంకేతిక సమస్యల వల్ల వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం భావిస్తుంది. గత సంవత్సరంలో 67.27 లక్షల మందికి పథకం చేరగా ఈ సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. 2026-27 విద్యా సంవత్సరంలో 68 లక్షల మంది ఈ సంవత్సరం లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది. తల్లికి వందనం క్రింద ప్రతి విద్యార్థి తరపున తల్లి యొక్క అకౌంట్ లో 15,000 అందిస్తుండగా వీటిలో స్కూళ్లు నిర్వహణ కోసం 2,000 తీసుకుంటున్నారు మిగతా 13,000 డైరెక్టుగా తల్లి యొక్క ఖాతాలో జమ చేస్తున్నారు.

తల్లికి వందనం నిధులు ఖాతాలో పడాలంటే  కచ్చితంగా తల్లి బ్యాంకు అకౌంటు యాక్టివ్ గా ఉండాలి. మరియు తల్లి బ్యాంకు అకౌంటుకు ఆధార్ తో లింక్ అయి ఉండాలి. అలాగే బ్యాంకు అకౌంట్ కు NPCI మ్యాపింగ్ జరిగి ఉండాలి. ఒకవేళ లింక్ కాకపోయినా బ్యాంకుకు వెళ్లి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే అర్హత జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డ్ లో చూడవచ్చు. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితా తయారు చేస్తుండగా పారదర్శకంగా రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసే చేస్తుండగా వచ్చే నెలలో బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలన్నారు. తల్లికి వందనం సంబంధించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్హులైన తల్లుల యొక్క అకౌంట్లో డైరెక్ట్ గా తల్లికి వందనం అందుతుంది అధికారులు ప్రకటించారు.

ఈ సంవత్సరం అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలో జూలై 10 నగదు జమ చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. అదే రోజే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థులు చదువులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు పథకం లబ్ది నేరుగా వారి వివరిస్తున్నారు అదేవిధంగా అనాధ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించడం పై ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది.

Leave a Comment