రాత పరీక్ష లేకుండా 10th, 12th అర్హతతో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | Anganwadi AWT/ AWH Notification 2026 apply online now
Telangana Anganwadi Notification 2026 Latest Anganwadi AWT, Anganwadi AWH Recruitment 2026 apply online now : అంగన్వాడీల్లో 15,982 పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసినది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్ & నల్గొండ జిల్లాల్లో నోటిఫికేషన్లు వచ్చాయి. ఈరోజు మరో జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది. మల్టీజోన్-1 పరిధిలో 1,853 అంగన్వాడీ టీచర్, 7,737 అంగన్వాడీ హెల్పర్లు, మల్టీజోన్-2 పరిధిలో 1,247 అంగన్వాడీ టీచర్, 5,145 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్ పూర్తి చేసిన స్థానికులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (DSC) ఇంటర్వ్యూలు ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తున్నారు.

ఈరోజు ములుగు జిల్లా పరిధిలోని (02) తాడ్వాయి మరియు వెంకటాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 31 అంగన్వాడీ టీచర్ (AWT) మరియు 85 అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడినవి. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష లేదు. అభ్యర్ధులు పూర్తి వివరాల కోసం https://wdcw.tg.nic.in/వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
*దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01.07.2026
*దరఖాస్తుల చివరి తేదీ: 15.07.2026 సాయంత్రం 5.00 గంటల వరకు.
ముఖ్య నిబంధనలు మరియు అర్హతలు:
> విద్యా అర్హత: అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్ధులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, ఎస్సెస్సీ / 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
> వయస్సు: 01.07.2026 నాటికీ అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
> స్థానికత: 1. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి/ వార్డ్ (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతీకి (రూరల్) చెందిన స్థానికురాలై అయి ఉండాలి.
ఎంపిక విధానం:
1. అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి, గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్రం గ్రామాపంచాయతి నివాసి అయి ఉండాలి.
2. ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అదే గ్రామం/ ఆవాసం/హాబిటేషన్ నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
3. ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అదే గ్రామ పంచాయతీలోని ఆవాసల / గ్రామాల నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది:
*ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్- 70 మార్కులు.
*ప్రత్యేక కేటగిరీలు: వితంతువులు-5 మార్కులు, అనాథలు- 10 మార్కులు, దివ్యాంగులు – 5 మార్కులు.
*జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ – 10 మార్కులు. దరఖాస్తు https://wdcw.tg.nic.in/వెబ్సైట్ నందు మాత్రమే Apply చేయవలెను.
ముఖ్య గమనిక : ఈ నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేయుటకు లేదా అవసరమైన మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ /చైర్మన్, ములుగు వారికి పూర్తి అధికారాలు కలవు. సిడిపిఓ / DWO / ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.
ముఖ్యమైన తేదీలు:
*దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01.07.2026
*దరఖాస్తుల చివరి తేదీ: 15.07.2026 సాయంత్రం 5.00 గంటల వరకు.

🛑Notification Pdf Click Here
🛑 Vacancies and Roster List Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here
