Exam లేకుండా Anganwadi లో డైరెక్ట్ జాబ్స్..33 జిల్లాలలో 3100 టీచర్లు, 12,882 సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

Exam లేకుండా Anganwadi లో డైరెక్ట్ జాబ్స్..33 జిల్లాలలో 3100 టీచర్లు, 12,882 సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

Telangana ICDS Anganwadi Teachers and Anganwadi Helpers Recruitment 2026 Apply Now: తెలంగాణనిరుద్యోగం మహిళలకు శుభవార్త.. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 15,982 ఉద్యోగుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.  ఈరోజు మరొక జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్టు వారి ఖాళీలు గుర్తింపు శిశు సంక్షేమ శాఖ భర్తీ నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఇందులో 3,100 పోస్టులు టీచర్లు, 12,882 పోస్టులు సహాయక ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఈ రోజులు కొత్త జిల్లాలో దరఖాస్తుల ప్రారంభతేదీ 29.06.2026 నుంచి 08.07.2026 సాయంత్రం 5.00 గంటల వరకు అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐ.సి.డి.యస్ గద్వాల్, మల్దకల్ మరియు మనోపాడ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 64 అంగన్వాడి టీచర్లు మరియు గిరిజన ప్రాంతంలో 09 అంగన్వాడి సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్దినుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరనైనది. తేది: 29/06/2026 నుండి 08/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటలలోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:

విద్య అర్హత: సదరు అభ్యర్ధునీలు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలయును. ఆయా (హెల్పర్) పోస్ట్ కు ఇంటర్ అభ్యర్థినులు లేని యెడల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక పరిగణలోకి తీసుకోబడును.

వయస్సు: 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.

•స్థానికత : దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి.

•గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి చెందిన వారు అయి ఉండాలి. పట్టణ ప్రాంతానికి సంబందిత వార్డ్కు చెందిన వారు అయి ఉండాలి.

•ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే హామ్లెట్/ ఆవాసం (Habitation) కు చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

•ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామపంచాయతీకి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. సంబందిత తహసిల్దార్ గారిచే ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రము తప్పనిసరిగా జతచేయవలయును. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపు తీసుకున్న నివాస ధ్రువీకరణ పత్రములను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

రిజర్వేషన్: పోస్టువారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ (కులం/వర్గం)కు సంభందించిన అభ్యర్థినులు మాత్రమే అర్హులు.

•ఒక వేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గెజెట్ లో గాని, కోర్టు ఉత్తర్వులు గాని ఉంటేనే ఆ అభ్యర్థిని పేరును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

జిల్లాల వారీగా ఖాళీ వివరాలు

జిల్లా              –   టీచర్లు  –  సహాయకులు
•ఆసిఫాబాద్    – 182       – 452
•మంచిర్యాల    – 110      – 398
•పెద్దపల్లి          – 56         – 252 – Open
•భూపాలపల్లి   -50          – 133
•ములుగు        -95          – 319
•నిర్మల్              – 80        – 435
•ఆదిలాబాద్     -176       – 628
•నిజామాబాద్    – 80       – 601
•జగిత్యాల         – 70       – 352
•కరీంనగర్         -56        – 230
•సిరిసిల్ల            – 57       – 181
•సిద్దిపేట            -84       – 271
•కామారెడ్డి         – 106      – 445
•మెదక్              – 63       – 345
•కొత్తగూడెం        – 192     – 1,033
•ఖమ్మం              -136      – 655
•మహబూబాబాద్ – 116       – 478
•వరంగల్               – 63         – 289
•హనుమకొండ        – 71         – 240
•సూర్యాపేట           – 84          – 321
•నల్గొండ                 – 148       – 688 – Open
•జనగామ                – 27        – 187
•యాదాద్రి భువనగిరి -62        – 270
•మేడ్చల్                  – 64        – 227
•హైదరాబాద్            – 183      – 402
•రంగారెడ్డి                 – 137      – 611
•సంగారెడ్డి                 – 80        – 416
•వికారాబాద్              – 94        – 399
•మహబూబ్నగర్        – 62        – 364- Open
•గద్వాల                     – 65       – 308- Open
•వనపర్తి                      – 47       – 203
•నారాయణ పేట        – 32        – 196
•నాగర్కర్నూల్             – 162     – 553

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్ వాడి కేంద్రము యొక్క సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో తేది: 08-07-2026 నుండి 17-07-2026 వరకు అన్ని కార్యాలయ పని వేళలలో ఒరిజినల్ ద్రువపత్రాలను, attested Xerox కాపీలతో పరిశీలనకు సమర్పించవలెను. లేని యెడల వారి దరఖాస్తులను పరిగణనలోనికి తీసుకొనబడవు.

ఈ క్రింద తెలపబడిన వికలాంగులైన అభ్యర్దినులు కూడా దరఖాస్తు చేసుకోనవచ్చు.

1. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు.

2. అంధత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించు కోగలిగిన వారు.

3. కాళ్ళు, చేతులకు సంబంధించిన అంగ వైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణ కు ఏలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు.

🛑ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధ్రువీకరణ పత్రాలు (Scanned copies)

1.పుట్టిన తేది / వయస్సు ధృవీకరణపత్రము ( SSC certificate ).

2. కుల ధృవీకరణపత్రము తహసిల్దార్ చే

3. విద్యార్హత ధృవీకరణపత్రము. ఇంటర్ / ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా.

4. నివాస ధృవీకరణపత్రము. తహసిల్దార్ చే

5. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణపత్రము.

7. ఆనాధ అయితే ఆనాధ సర్టిఫికేట్.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల పూర్తి వివరాలు జతపరచడం అయినది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు పరచటానికి గానీ, మార్పులు చేయడానికిగానీ జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారం కలదు. (జిల్లా కలెక్టర్, జోగుళాంబ గద్వాల్ గారి అనుమతితో ఈ ప్రకటన జారీ ఛేయనైనది).

🛑New Notification Pdf Click Here

🛑 Vacancy And Roster Details Click Here

🛑 Education Qualification & Guidelines Click Here

🛑Online Apply Link Click Here

Leave a Comment