NEET విద్యార్థులకు బిగ్ అలర్ట్.. MCC కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ విడుదల
NEET MCC Counselling Guidelines Release 2026 : నెట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియ సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) పూర్తిగా కంప్లీట్ గైడ్లైన్స్ విడుదల చేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నెట్ యూజీ NEET UG రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల చేసిన తరువాత, విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించి అత్యున్నత కీలకమైన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రవేట్ మెడికల్ కళాశాలలు ఎంబీబీఎస్, బిడీఎస్ సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) కంప్లీట్ గైడ్లైన్స్ విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ నాలుగు రౌండ్లు ఉంటాయి.

1. మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులు ఎంసీసీ అధికార వెబ్సైట్లో https://mcc.nic.in/ రిజిస్ట్రేషన్ చేసుకొని, నాన్ రికమండేబుల్ కౌన్సిలింగ్ ఫీజు & రికమండేబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆన్లైన్ లో చెల్లించవలసి ఉంటుంది.
2. రెండవ దశలో విద్యార్థులు తమకు ఇచ్చిన మెడికల్ కాలేజ్ మరియు కోర్సు ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. ఎక్కువ ఆప్షన్ ఇస్తే సీటు దక్కే అవకాశాలు పెరుగుతాయి.
3. మూడో దశలో సెలక్షన్ చేస్తున్న కాలేజీ జాబితాను గడువు ముగిసే లోపు లాక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ లాక్ చేయక మర్చిపోతే, గడువు మూసే లోగా స్ట్రీమింగ్ ఆటోమేటిక్ గా లాక్ చేస్తుంది, ఒకవేళ లాక్ చేసిన తర్వాత ఆప్షన్ మళ్ళీ మార్చడం కుదరదు.
4. నాలుగో దశలో అభ్యర్థి ఆల్ ఇండియా ర్యాంకు (AIR), రిజర్వేషన్ కేటగిరి కాలేజీ సీట్లు లభ్యత, క్యాండిడేట్ ఇచ్చిన వ్యాప్ ఆప్షన్ ఆధారంగా కంప్యూటర్ ఆల్గారథ్యం ద్వారా సీట్లు కేటాయిస్తారు.
5. ఐదవ దశలో సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ లెటర్ ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు ఆ అలాట్మెంట్ లెటర్ ను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొని తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో సహా ఇచ్చిన టైం లోపు కేటాయించిన కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

